Prakasam: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృతి..

Prakasam: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృతి..
Prakasam: ప్రకాశం జిల్లా కంభం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఐదుగురు చనిపోయారు.

Prakasam: ప్రకాశం జిల్లా కంభం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో స్పాట్లోనే ఐదుగురు చనిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.. దర్శనం కోసం తిరుపతి వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. అమరావతి- అనంతపురం నేషనల్ హైవేపై ఈ ఘటన జరిగింది. లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టండతో నుజ్జునుజ్జయింది. దాంతో అందులో ఉన్న వారంతా చనిపోయారు. మృతులను గుంటూరు జిల్లా సిరిగిరిపాడుకు చెందిన వారిగా గుర్తించారు. చనిపోయిన వాళ్లలో జోలకంటి నాగిరెడ్డి, పల్లె అనంతరాముడు, భూమిరెడ్డి గురమ్మ, చిలకల అనిమిరెడ్డి, చిలకల ఆదిలక్ష్మమ్మ ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story