Ganja Seize : రైల్లో 60 కిలోల గంజాయి స్వాధీనం

Ganja Seize : రైల్లో 60 కిలోల గంజాయి స్వాధీనం
X

రైళ్లలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు ముఠా సభ్యులలో కీలక నిందితుడిని అరెస్ట్ చేసి 60 కేజీల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఎండు గంజా యిని ఒడిశా రాష్ట్రం గజపతి నుంచి ఢిల్లీకి రవాణా చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడని జీఆర్పీ పోలీసుల విచారణలో తేలింది. ఈక్రమంలో ఈకేసులోని నింది తులు దిలీప్ కుమార్ నాయక్, తపోన్, విజయపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు దిలీప్

కుమార్ గంజాయి సంచులను ఇచ్చాపురం నుంచి విశాఖ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వరకు రవాణా చేస్తున్నట్లు తేలింది.

గంజాయి ఆయిల్ పట్టివేత

భువనగిరిలో రూ.20 లక్షలు విలువైన గంజాయి ఆయిల్ పట్టుకుని ఇద్దరు నిందితులతో పాటు కస్టమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 2 లీటర్ల హాష్ ఆయిల్, 3 సెల్ఫోన్లు, ఒక కారు, రూ.2500 నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

Tags

Next Story