Ganja Seize : రైల్వే స్టేషన్‌లో 60 కిలోల గంజాయి పట్టివేత

Ganja Seize : రైల్వే స్టేషన్‌లో 60 కిలోల గంజాయి పట్టివేత
X

రైల్వే స్టేషన్‌లో 60 కిలోల గంజాయి సరుకును జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు పట్టుకున్నారు. బుధవారం సికింద్రాబాద్‌ జీఆర్‌పీ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జావెద్‌, రైల్వే ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెంబర్‌2లో ఆగి ఉన్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బుధవారం సికింద్రాబాద్‌ జీఆర్‌పీ సీఐ సాయిఈశ్వర్‌గౌడ్‌, ఆర్పీఎఫ్‌ సీఐ సరస్వత్‌లతో పాటు ఆర్పీఎఫ్‌ ఎస్సై సుబ్బారావు కలిసి తనిఖీ చేశారు.

ఒడిశాకు చెందిన దిలీప్‌కుమార్‌ (34) వద్ద ట్రాలీ బ్యాగు కనిపించడంతో పోలీసులు తనిఖీ చేశారు అందులో 60కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ వ్యవహారంలో ఢిల్లీకి చెందిన తపాన్‌, బిజయ్‌ వ్యక్తులకు గంజాయి సరుకు ఇవ్వడానికి ఢిల్లీ వెళుతున్నట్లు తెలి పాడు. ప్రస్తుతం తపాన్‌, బిజయ్‌లు పరారీలో ఉన్నారని రైల్వే పోలీసులు తెలిపారు. రూ.15లక్షల విలువ చేసే 60 కిలోల గంజాయి సరుకును స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు

Tags

Next Story