కారు డ్రైవర్ మద్యం మత్తు.. చక్రాల కింద నలిగిన ఏడేళ్ల బాలుడి జీవితం..

కారు డ్రైవర్ మద్యం మత్తు.. చక్రాల కింద నలిగిన ఏడేళ్ల బాలుడి జీవితం..

పూణెలో గురువారం జరిగిన ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడు, అతని తల్లి ప్రయాణిస్తున్న స్కూటర్‌ను కారు బలంగా ఢీకొట్టడంతో వెనుక కూర్చున్న బాలుడు కింద పడిపోయాడు. దాంతో కారు బాలుడిని 700 నుంచి 800 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిందని పోలీసులు తెలిపారు.

కారు వారిని బలంగా ఢీకొట్టడంతో తల్లికి తీవ్రగాయాలు అయ్యాయని, బాలుడు ప్రాణాలు కోల్పోయాని వివరించారు. బాధితులకు సహాయం చేయడానికి ప్రజలు కారు వైపు పరుగెత్తారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ రాహుల్ తప్కీర్ మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన తల్లీ కొడుకులను ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది.

బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లికి తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రాహుల్ తప్కీర్ (40)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూణేలోని చరోలి ఫాటా వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Tags

Read MoreRead Less
Next Story