సెల్ఫీ దిగుదామని నమ్మించి.. కొండ పైనుంచి తోసేశాడు..!

సెల్ఫీ దిగుదామని నమ్మించి.. కొండ పైనుంచి తోసేశాడు..!
భార్యపై అనుమానంతో పెళ్లైన రెండు నెలలకే హత్య చేశాడో భర్త. సెల్ఫీ దిగుదామని నమ్మించి.. గుట్ట పైకి తీసుకెళ్లి తోసేశాడు.

భార్యపై అనుమానంతో పెళ్లైన రెండు నెలలకే హత్య చేశాడో భర్త. సెల్ఫీ దిగుదామని నమ్మించి.. గుట్ట పైకి తీసుకెళ్లి తోసేశాడు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ దారుణం జరిగింది. అయిజ మండలం పరిధిపురానికి చెందిన గీతాంజలికి, గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన రాముకి రెండు నెలల క్రితమే పెళ్లైంది. తనతో మానసికంగా, శారీరకంగా అయిష్టంగా ఉండడంతో.. రాము అనుమానం పెంచుకున్నాడు. గీతాంజలిని చంపేయాలనే ఉద్దేశంతో.. వనపర్తిలోని తిరుమలాయ గుట్టకు దర్శనానికి వెళ్దామని చెప్పి తీసుకెళ్లాడు. సెల్ఫీ దిగుదామని నమ్మించి కొండ చివరకు తీసుకెళ్లి తోసేశాడు. ఏమీ ఎరగనట్టు భార్య కనిపించడం లేదని కట్టుకథ అల్లాడు. అల్లుడిపై అనుమానంతో కంప్లైంట్‌ ఇవ్వడంతో.. తమ స్టైల్‌లో విచారించారు పోలీసులు. దీంతో హత్య చేసింది తానేనని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story