West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. మంచంపై తల లేని మొండెం..

West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. మంచంపై తల లేని మొండెం..
X
West Godavari: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం జగ్గిశెట్టిగూడెంలో దారుణం చోటుచేసుకుంది.

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం జగ్గిశెట్టిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. పొలంలో మేకల మందకు కాపలాగా పడుకున్న వ్యక్తి దారణ హత్యకు గురయ్యాడు. మంచంపై తల లేని మొండెం పడి ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మొండెంను బట్టి వనముల పర్వతాలు అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తిని అతి కిరాతకంగా ఎవరు చంపారు..? హత్యకు గల కారణాలేంటి..? మొండెం అక్కడే పడేసి తలను పట్టుకెళ్లారా..? ఎక్కడైనా పడేసారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Tags

Next Story