Guntur: గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య..

X
Guntur: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళపై అత్యాచారం ఘటన మరువక ముందే… గుంటూరు జిల్లాలో ఓ మహిళ అఘాయిత్యానికి బలైంది. దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. బుధవారం సాయంత్రం ఇంట్లో మృతదేహం పడి ఉండడం స్థానికులు గుర్తించారు.
మృతదేహంపై గోళ్లతో రక్కిన గాయాలు, పంటిగాట్లు ఉండడంతో.. అత్యాచారం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉండగా… భర్త పనుల నిమిత్తం తిరుపతికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటన స్థలంలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు… ప్రాథమిక ఆధారాలను బట్టి నిందితుల కోసం గాలిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
