ACB : రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీ ఏఈ

ACB : రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీ ఏఈ

రూ.5 వేలు లంచం తీసుకుంటూ సూర్యాపేట జిల్లాలో (Suryapet) ఓ పంచా యతీరాజ్ ఏఈ ఏసీబీకి (ACB) చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఎంవీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్ ధారవత్ కృష్ణమేళ్లచెరువు మండలం కప్పలకుంట తండాలో ఎల్ ఈడీ లైట్లను పనులు చేయించాడు. వాటికి సంబంధించి రూ.లక్షా 98వేలు రావాల్సి ఉంది.

పనులకు సంబంధించిన ఎంబీ రికార్డు చేయడానికి పంచాయతీ ఏఈ కోసూరి రంగరాజు లంచం డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏఈ రంగరాజు మంగళవారం సాయంత్రం హుజూర్ నగర్ డివిజనల్ ఆఫీసులో కాంట్రాక్టర్ కృష్ణ నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు.

రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్టు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. రైడ్ లో ఇన్స్పెక్టర్లు బి.రామారావు, బి.వెంకట్ రావు, శ్రీధర పాల్గొన్నారు. ఎవరైనా లంచం అడిగినట్లయితే ఏసీబీకి తెలపాలని శ్రీనివాసరావు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story