క్రైమ్

Chittoor: అధిక వడ్డీలు ఆశచూపి ఏకంగా రూ.152 కోట్లు కొల్లగొట్టిన సంస్థ..

Chittoor: నోబెల్‌ అసెట్స్‌ సంస్థ తిరుపతి, చెన్నై, పుత్తూరు, తిరుత్తణిలోని సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేసింది.

Chittoor: అధిక వడ్డీలు ఆశచూపి ఏకంగా రూ.152 కోట్లు కొల్లగొట్టిన సంస్థ..
X

Chittoor: అధిక వడ్డీలు ఆశచూపి ఏకంగా 152 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. నోబెల్‌ అసెట్స్‌ సంస్థ తిరుపతి, చెన్నై, పుత్తూరు, తిరుత్తణిలోని సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఫారిన్‌ ట్రేడింగ్, షేర్‌ మార్కెట్‌ పేరుతో లాభాలు, అధిక వడ్డీలు ఎరచూపి కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టించింది. ఏడాదిన్నర నుంచి వడ్డీలు చెల్లించడం ఆపేసింది.

చివరికి తిరుపతి, చెన్నై, పుత్తూరు, తిరుత్తణిలోని సంస్థ బ్రాంచ్‌లన్నింటినీ రాత్రికిరాత్రే ఖాళీ చేసి ఉడాయించింది నోబెల్ అసెట్స్‌ సంస్థ. అధిక వడ్డీల మాయలో పడి వేలాది మంది మోసపోయారు. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న నోబెల్‌ అసెట్స్‌ సంస్థ.. 2018 పుత్తూరులో ఆఫీస్ ప్రారంభించింది. ఓవైపు బాధితులు లక్షలు, కోట్లలో నష్టపోయినా సరే.. ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES