Kidney Exchange : మరో కిడ్నీ మార్పిడి ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్ కేంద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ కేరళలో బిజినెస్ చేస్తున్న ఓ ఘరానా కిడ్నీ రాకెట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ కిడ్నీ రాకెట్ నడిచింది. హైదరాబాదులోని ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఈ దారుణంలో ఉందని కేరళ పోలీసులు చెప్పడం సంచలనంగా మారింది.
కిడ్నీ రాకెట్ ముఠా సభ్యులు బాధితులను హైదరాబాద్ నుంచి కొచ్చికి.. అక్కడి నుంచి ఇరాన్ కు తరలిస్తారు. సముద్ర యానం ద్వారా ఇరాన్ కు తీసుకువెళ్లి కిడ్నీ ఆపరేషన్లు చేస్తారు. ఇప్పటివరకు పదుల సంఖ్యలో యువకుల్ని ఇరాన్ తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.
కొచ్చిలో వెలుగు చూసిన ఈ ఘటనలో.. కిడ్నీ రాకెట్ సభ్యుడైన సబిత్ అనే యువకుడు అరెస్ట్ చేశారు పోలీసులు. సబిత్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ చేరుకున్నారు కేరళ పోలీసులు. కేసు దర్యాప్తును నిజాలను తవ్వుతున్నారు. హైదరాబాద్ డాక్టర్ కి ఇద్దరు యువకులు సహకరించినట్లుగా అనుమానిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు చెబుతామని పోలీసులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com