Kuwait Fire Accident : కువైట్ ఫైర్ యాక్సిడెంట్‌లో ఏపీ కార్మికులు దుర్మరణం
ఇటీవల కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు వలస కార్మికులు మరణించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. మృతుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి లోకానందం, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎం సత్యనారాయణ, ఎం ఈశ్వరుడులు ఉన్నట్లు ఎన్‌ఆర్‌ఐ, వలస వ్యవహారాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ నాన్‌రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్) తెలిపింది. న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ (ఏపీ భవన్) ఏపీఎన్నార్టీఎస్‌తో పంచుకున్న సమాచారం మేరకు ఈ ముగ్గురిని గుర్తించారు.
"APNRTS మృతుల కుటుంబాలను సంప్రదించింది, తదుపరి సమాచారాన్ని నిర్ధారించింది. కుటుంబం తరపున విమానాశ్రయం నుండి వ్యక్తిగత వలసదారుల మృతదేహాలను స్వీకరించే వ్యక్తుల వివరాలను సేకరించింది" అని సొసైటీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కువైట్ అగ్నిప్రమాదంలో మృతుల పార్థివ దేహాలను తరలించే విషయంలో ఏపీ భవన్‌తో సమన్వయం చేసుకుంటోంది.
మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నం నాటికి న్యూఢిల్లీకి చేరుకుంటాయి. బాధితుల స్వస్థలాలకు తదుపరి రవాణా కోసం విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాలకు చేరుతాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com