Fake Doctor : తుకారాంగేట్‌లో నకిలీ డాక్టర్ అరెస్టు

తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నకిలీ వైద్యుడిని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని తుకారాంగేట్ పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తుకారాంగేట్ రియో పాయింట్ హోటల్ వద్ద ఉన్న ‘వాయి క్లినిక్’ పేరుతో కొద్ది నెలలుగా నకిలీ వైద్యుడు వెంకటేశ్వర్ రెడ్డి(41) క్లినిక్ నడుపుతున్నాడు. క్లినిక్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు లేకుండా డాక్టర్ వెంకట్ పేరుతో క్లినిక్ నిర్వహిస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఔషధనియంత్రణ అధికారులు తనిఖీలు చేశారు. డాక్టర్ సర్టిఫికెట్ లేకుండానే వెంకటేశ్వర్‌రెడ్డి క్లినిక్ నడుపుతున్నాడని విచారణలో వెల్లడైంది. క్లినిక్‌లో పెద్ద ఎత్తున మందులు నిల్వ ఉంచడంతో రూ.1.60లక్షల విలువ చేసే 44 రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఔషధ నియంత్రణ అధికారులు కేసు నమోదుచేసి అతన్ని తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com