Incident : వేములవాడలో దారుణం..లాడ్జీలో బాలికపై యువకుడి అత్యాచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ లాడ్జిలో బాలికపై యువకుడు అత్యాచారం చేయగా ఆమె పరిస్థితి విషమించింది. దీంతో కరీంనగర్ దవాఖానకు తరలించారు. నిందితుడిపై కిడ్నాప్, రేప్, పోక్సో, ఎస్సీ ఎస్టీ యాక్ట్ల కింద కేసు నమోదు చేసినట్టు టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మైదం సాయికుమార్ (Sai Kumar) (23) జగిత్యాల జిల్లాలో ఓ బాలికను కిడ్నాప్ చేసి వేములవాడలోని ప్రైవేట్లాడ్జికి తీసుకువచ్చాడు. అక్కడ అత్యాచారం చేయగా బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. పరిస్థితి విషమించడంతో ముందు వేములవాడలోని ఓ దవాఖానకు తీసుకువెళ్లగా డాక్టర్ల సూచన మేరకు కరీంనగర్ తరలించారు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు సాయికుమార్పై కేసు నమోదు చేశారు. రూల్స్ పాటించని లాడ్జి నిర్వాహకుడిపైనా కేసు ఫైల్ చేశామని పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com