Toll Plaza : టోల్ ప్లాజాపై దాడి.. పారిపోతుండగా బావిలో పడి సిబ్బంది మృతి

Toll Plaza : టోల్ ప్లాజాపై దాడి.. పారిపోతుండగా బావిలో పడి సిబ్బంది మృతి

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) టోల్ ప్లాజాలో ఇద్దరు ఉద్యోగులు టోల్ టాక్స్ వివాదంపై ముసుగులు ధరించిన ముష్కరుల దాడిలో తమను తాము రక్షించుకోవడానికి పరిగెత్తుతుండగా బావిలో పడి మునిగిపోయారు. ఆగ్రాకు చెందిన శ్రీనివాస్ పరిహార్, నాగ్‌పూర్‌కు చెందిన శివాజీ కండెలె మృతదేహాలను ఏప్రిల్ 3న బావిలో నుంచి వెలికి తీశారు. ఏప్రిల్ 2న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

జాతీయ రహదారి - 44లోని దగ్రాయ్ టోల్ ప్లాజా వద్ద ఉన్న CCTV కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీలో నాలుగు బైక్‌లపై ముసుగులు ధరించిన వ్యక్తులు టోల్ బూత్‌ల దగ్గర ప్రయాణిస్తున్నట్లు చూపిస్తుంది. వారు టోల్ కౌంటర్ల తలుపుల వద్ద తన్నడం ప్రారంభించారు. అంతలోనే కొందరు బూత్‌లలోకి ప్రవేశించి.. కంప్యూటర్లను ధ్వంసం చేయడం, టోల్ ప్లాజా సిబ్బందిని కొట్టడం, బయటకు లాగడానికి ప్రయత్నించారు.

దుండగులు గాల్లోకి కాల్పులు జరపడంతో సిబ్బంది ప్రాణాలను కాపాడుకునేందుకు పక్కనే ఉన్న పొలంలోకి పరుగులు తీశారు. వారు పరిగెత్తుతుండగా, పరిహార్, కండెలే కార్యాలయం వెనుక ఉన్న ఒక మూతలేని బావిలో పడి మునిగిపోయారు. ఈ ఘటనలో గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story