TS : తీసుకున్న డబ్బు ఇమ్మన్నందుకు కత్తితో దాడి

TS : తీసుకున్న డబ్బు ఇమ్మన్నందుకు కత్తితో దాడి
X

తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన ఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సనత్‌నగర్‌, అశోక్‌కాలనీకి చెందిన మహ్మద్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి 11:30గంటల ప్రాంతంలో ఖలీమ్‌, సయ్యద్‌, జాహిద్‌తో కలిసి అమీర్‌పేటకు టీ తాగేందుకు వెళ్లారు. తిరిగి వస్తూ మార్గమధ్యలో బీకేగూడ వద్ద కూరగాయాల సంతలో నిమ్మకాయల వ్యాపారం చేస్తున్న అమీన్‌ను కలిశారు. గతంలో తీసుకున్న రూ.5 వేలు ఇవ్వాలని ఖలీమ్‌ అడగడంతో ఘర్షణ జరిగింది. అహ్మద్‌ఖాన్‌, ఖలీమ్‌, జాహిద్‌ బైక్‌పై వెళ్లబోగా అమీన్‌ కత్తి తీసుకుని వారిపై దాడి చేయగా అహ్మద్‌ఖాన్‌కు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అమీన్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Tags

Next Story