Krishna District: బ్యాంక్‌లో రూ.2.50 కోట్లు గోల్‌మాల్.. ఉద్యోగులే దొంగలు..

Krishna District: బ్యాంక్‌లో రూ.2.50 కోట్లు గోల్‌మాల్.. ఉద్యోగులే దొంగలు..
Krishna District: కృష్ణా జిల్లాలోని సహకార బ్యాంక్‌లో ఘరానా మోసం బట్టబయలైంది.

Krishna District: కృష్ణా జిల్లాలోని సహకార బ్యాంక్‌లో ఘరానా మోసం బట్టబయలైంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బ్యాంక్‌లో 2.50 కోట్ల రూపాయల గోల్‌మాల్ జరిగింది. నకిలీ బాండ్స్ ఇచ్చి బ్యాంకు సిబ్బంది కోట్లు కొల్లగొట్టారు. ఈ ఘటన ఉంగటూరు మండలం అత్కుర్‌లో చోటుచేసుకుంది. ఇటీవల తెలప్రోలు KDCC బ్యాంక్ మేనేజర్ టి. రంగప్రసాద్.. సొసైటీలో గోల్డ్‌ లోన్లు రికార్డుల పరిశీలించేందుకు వచ్చారు.

అయితే తనిఖీల్లో నిధుల దుర్వినియోగాన్ని ఆయన గుర్తించారు. మొత్తం 70 మందికి పైగా బ్యాంక్ సెక్రెటరీ శంకర్‌రావు, క్యాషియర్ మోసం చేసినట్లు తెలుస్తోంది. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బ్యాంక్ సెక్రటరీ శంకర్‌రావు పరారీ ఉన్నారు. ఈ ఘరానా మోసంలో క్యాషియర్ శివకుమారి పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. మరోవైపు సహకార బ్యాంక్ ముందు ఆత్కుర్ పరిసర ప్రాంతాల బాధితులు ఆందోళన చేపట్టారు.

ఫేక్ బాండ్స్ ఇచ్చి తమను మోసం చేశారని ఆరోపించారు. తమకు రావాల్సిన డబ్బులు మొత్తం ఇస్తేనే.. ఇక్కడి నుంచి కదులుతామని బాధితులు అన్నారు. పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బులను మోసం చేసి దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సొంత బ్యాంక్ లాగా ముగ్గురు ఒకే కుటుంబం వాళ్లు సహకార బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని బాధితుల డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story