Road Accident : గుజరాత్ హైవేపై రక్తపుటేరులు..రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

X
By - Manikanta |15 July 2024 3:26 PM IST
అహ్మదాబాద్-వడోదర హైవేపై మరో ప్రమాదం జరిగింది. గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి అని పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అహ్మదాబాద్ - వడోదర ఎక్స్‌ప్రెస్ హైవే పై వెళుతున్న బస్సు ఓ ట్రక్కును ఢీకొట్టింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆనంద్ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయని పోలీస్ సూపరింటెండెంట్ గౌరవ్ జసాని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com