Kuwait Fire Victims : కొచ్చి నుంచి స్వస్థలాలకు కువైట్ అగ్నిప్రమాద మృతదేహాలు

కువైట్ లో ( Kuwait ) ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 45 మంది దారుణ పరిస్థితుల్లో మృత్యువాత పడ్డారు. వారంతా భారతీయులే. వారి మృతదేహాలను ప్రత్యేక విమానంలో మనదేశానికి తీసుకొచ్చారు.
వైమానిక దళానికి చెందిన విమానం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. 12న కువైట్ లోని అల్ మంగాఫ్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది మన దేశానికి చెందిన కార్మికులు మరణించారు.
మృతుల్లో కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఉత్తరప్రదేశ్ కు చెందిన ముగ్గురు, ఏపీకి చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఇద్దరు, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com