Kurnool: బావను గొడ్డళ్లతో నరికి చంపిన బావమరుదులు..

Kurnool (tv5news.in)
X

Kurnool (tv5news.in)

Kurnool: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. సొంతబావను వేట కొడవళ్లతో.. నరికి చంపారు బామ్మార్ధులు.

Kurnool: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. సొంతబావను వేట కొడవళ్లతో.. నరికి చంపారు బామ్మార్ధులు. ఈ ఘటన ఆస్పరి మండలం వెంగలయదొడ్డి గ్రామంలో జరిగింది. వారం క్రితం.. భర్త సుంకన్నతో.. గొడవపడి పుట్టింటికి వెళ్లింది భార్య నారాయణమ్మ. తిరిగి తన ఇంటికి రావాలంటూ భార్యతో గొడవకు దిగాడు సుంకన్న. దీంతో ఆగ్రహించిన నారాయణమ్మ సోదరులు.. అతన్ని ఊరి చివరికి తీసుకెళ్లి వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుంకన్నను.. ఆసుపత్రికి తీసుకుతుండగా మార్గమధ్యలోనే అతను చనిపోయాడు. దీంతో.. ఆసుపత్రిలోనే మృతదేహాన్ని వదిలేసి పారిపోయారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులో తీసుకుంటామన్నారు సీఐ ఈశ్వరయ్య.

Tags

Next Story