Kakinada : చెల్లితో క్లోజ్‌గా ఉంటున్నాడని..యువకుడిని చంపిన అన్న

కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో విషాదం చోటుచేసుకుంది. తన చెల్లితో క్లోజ్ ఉంటున్నాడన్న కారణంతో ఓ యవకుడిని బాలిక బ్రదర్ చంపేశాడు. పి.వేమవరం గ్రామానికి చెందిన కిరణ్ కార్తిక్ గతనెల 27 నుంచి కనిపించడం లేదంటూ అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూలీలకు ఎక్కువ డబ్బులిచ్చాడని తాను తిట్టడంతో ఎటో వెళ్లిపోయాడని ఫిర్యాదులో తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి మొబైల్ నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కృష్ణప్రసాద్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటూ 20 రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడు. తన చెల్లితో ఎందుకు ఫోన్ లో మాట్లాడుతున్నావని.. కిరణ్ కార్తిక్ తో గొడవపడ్డాడు.
గత నెల 24న కృష్ణప్రసాద్, అతని ఫ్రెండ్ తో కలిసి పార్టీ ఇస్తానని నమ్మించి కిరణ్ కార్తిక్‌ను బ్రహ్మానందపురం జగనన్న లేఔట్‌లోకి తీసుకువెళ్లారు. అక్కడ కార్తిక్ తలను నేలకు కొట్టి, గొంతు నులిమి హత్యచేశారు. మృతదేహాన్ని మట్టి దిబ్బలో పూడ్చేసి రెండు రోజుల తరువాత కృష్ణప్రసాద్ హైదరాబాద్ వెళ్లిపోయాడు. విషయం బయటకు తెలుస్తుందనే భయంతో తిరిగి శుక్రవారం ఉదయం గ్రామానికి చేరుకుని వీఆర్‌వో వద్దకు వెళ్లి తామే హత్య చేసినట్లు లొంగిపోయాడు. వీఆర్వో ఫిర్యాదుతో అదృశ్యం కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. హత్య జరిగి 10 రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయింది. దాంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు. తమ కొడుకుని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com