Nellore: ఆగి ఉన్న లారీనీ ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

Nellore: ఆగి ఉన్న లారీనీ ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
నెల్లూరు జిల్లా మనుబోలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

నెల్లూరు జిల్లా మనుబోలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్దెవోలు క్రాస్ రోడ్డు వద్ద ఆగివున్న లారీని వెనుక నుంచి ఇన్నోవా కారు ఢీ కొట్టింది. దీంతో అక్కడిక్కకడే ముగ్గురు మృతి చెందారు, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో డ్రైవర్‌, యువతి , నాలుగేళ్ల బాలుడు ఉన్నారు. ప్రమాందంలో కారు నుజ్జు నుజ్జు అయింది. మృతులు కొడవలూరు మండలం దానేగుంటకు చెందిన వారిగా గుర్తించారు. నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story