Case Registered : దొంగతనానికి వెళ్లి హాయిగా నిద్రపోయాడు

ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఓ వ్యక్తి దొంగతనానికి వెళ్లి ఇంట్లో ఏసీ ఆన్ చేసుకుని హాయిగా నిద్రపోయాడు. పోలీసులు అతడిని నిద్రలేపి అరెస్టు చేశారు. ఓ డాక్టర్ కుటుంబం పనిమీద వారణాసికి వెళ్లగా, పీకలదాకా మద్యం తాగిన దొంగ వారి ఇంట్లోకి చొరబడ్డాడు. ఏసీ ఆన్ చేసుకుని నేలపై పడుకున్నాడు. బయట గేట్ ఓపెన్ చేసి ఉండటంతో పక్కింటి వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు.
ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వికాస్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన దొంగను ముసద్దిపూర్ నివాసి కపిల్ కశ్యప్ గా గుర్తించారు. అవకాశం లభించిన వెంటనే కపిల్ తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇన్వర్టర్ బ్యాటరీ, గీజర్, పాత్రలు, మరికొన్ని వస్తువులను రెండు బస్తాల్లో ప్యాక్ చేశాడు. ఆ వస్తువులను బస్తాల్లో ఉంచి అక్కడే సిగరెట్ తాగి నిద్రపోయాడు.
ఉదయం ఇరుగుపొరుగు వారు తాళం పగులగొట్టి ఉండడం చూసి ఇంటి యజమానికి సమాచారం అందించారు. ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్‌కి చెప్పాడు.పోలీసులు, వైద్యులతో పాటు కొందరు ఇరుగుపొరుగు వారు కూడా ఇంటి లోపలికి చేరుకున్నారు. అక్కడ కపిల్ నిద్రిస్తున్నట్లు గుర్తించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com