Tirumala Laddu Case : తిరుమల లడ్డూ కేసు నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించేందుకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన నలుగురిని సీబీఐ అరెస్టు చేసింది. వారిని తిరుపతి కోర్టులో హాజరుపర్చింది. సుప్రీంకోర్టులో ఈ వివాదంపై అభియోగాలు నమోదయ్యాయి. విచారించిన సుప్రీంకోర్టు కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సీబీఐలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. ఈ మేరకు నలుగురిని అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో రూర్కీకి చెందిన భోలే బాబా డెయిరీ మాజీ డైరెక్టర్ విపిన్ జైన్, సీఈవో పోమిల్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చద్వా ఏఆర్ డెయిరీ డైరెక్టర్ రాజు రాజశేఖరన్ ఉన్నారు ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు విచారణ జరిపిన అనంతరం కోర్టులో హాజరు పర్చారు. వైష్ణవి డెయిరీ ఏఆర్ డెయిరీ పేరు మీదు టెండర్లు పొందినట్టు తెలుస్తోంది. వైష్ణవి డెయిరీ తప్పుడు పత్రాలు, మ్యానిపులేటెడ్ సీల్స్ తో టెండర్లు పొందినట్లు అధికారులు గుర్తించారు. భోలే బాబా డెయిరీ కూడా ఫేక్ డాక్యుమెంట్లతో టెండర్లు పొందినట్టు సమాచారం. వాస్తవానికి ఆ సంస్థకు టెండర్లు పొందినంత నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదు ఈ వివరాలతో అభియోగ పత్రం దాఖలు చేసేందుకు సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ సిద్ధమవుతోంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com