Chain Snatcher : రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. బైక్ పై నుంచి కిందపడేసి గోల్డ్ చైన్ చోరీ

Chain Snatcher : రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు..  బైక్ పై నుంచి కిందపడేసి గోల్డ్ చైన్ చోరీ
X

తల్లి, కూతురు బైక్ పై వెళ్తుండగా వెనకాలే వెళ్లి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గోల్డ్ చైన్ కొట్టేసే క్రమంలో కిందపడ్డారు. అయినా వదలకుండా చైన్ లాక్కెళ్లిపోయారు. దీంతో తల్లి, కూతురికి గాయాలైన ఘటన ఘట్ కేసర్ పరిధిలో చోటుచేసుకుంది. పోచారం ఐటీసీ పోలీసులు తెలిపిన ప్రకారం.. గురువారం ఎన్ఎఫ్ సీ నగర్ కు చెందిన ఎర్రి సునీత, కూతురు శ్రీజతో కలిసి బైక్ పై ఘట్ కేసర్ కు వెళ్తున్నారు.

హైదరాబాద్– --వరంగల్ హై వే పై అన్నోజిగూడ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపైన వారి వెనకాల మరో బైక్ పై గుర్తుతెలియని ఇద్దరు స్నాచర్లు వెంబడించారు. శ్రీజ మెడలోని గోల్డ్ చైన్ లాగడంతో తల్లి, కూతురు కిందపడగా తీవ్రగాయాలు అయ్యాయి. అయినా వదలకుండా 10 గ్రాముల గోల్డ్ చైన్ దుండగులు లాక్కెళ్లిపోయారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి బాధితులను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. స్నాచర్లను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ లతో గాలింపు చేపట్టామని, బాధితుల కంప్లయింట్ తో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Tags

Next Story