TS : ఏసీబీకి చిక్కిన పరిశ్రామల శాఖ అవినీతి తిమింగళం

TS : ఏసీబీకి చిక్కిన పరిశ్రామల శాఖ అవినీతి తిమింగళం
X

మేడ్చల్ మల్కాజ్‌గిరి పరిశ్రమల శాఖ లో అవినీతి తిమింగలం ఏసిబి అధికారులకు చిక్కింది. పరిశ్రమ శాఖలో ఏడీగా పనిచేస్తున్న వెంకట్ నర్సిరెడ్డి ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కూకట్‌పల్లికి చెందిన రమేష్ టీఎస్ ప్రైడ్ స్కీం కింద 53 లక్షల టిప్పర్ వాహనం కొనుగోలు చేశాడు. దళిత స్కీం కింద వాహనం సబ్సిడీకి 23 లక్షలు వచ్చాయి. ఆ వాహనాన్ని తనిఖీ చేసేందుకు వెంకట నర్సారెడ్డి 50వేల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో జీడిమెట్ల ప్రాంతంలో నర్సిరెడ్డి రూ.45వేలు లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Tags

Next Story