Nallagonda : దళిత యువతిని మోసం.. నిందితుడికి 27 ఏళ్ల జైలు

నల్లగొండ జిల్లా అదనపు సెషన్స్, ఎస్సీ, ఎస్టీ కోర్టు మెజిస్ట్రేట్ గురువారం సంచలన తీర్పు వెలువరించింది. దళిత యువతిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి మోసం చేసిన వ్యక్తికి 27 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్సీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. కనగల్ మండల పరిధిలోని పర్వతగిరి గ్రామానికి చెందిన నల్లబోతు జగన్ గుర్రంపోడు మండలం శాఖపురం గ్రామానికి చెందిన యువతికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన తరువాత మాట మార్చాడు. బాధితురాలు నిందితుడు నల్లబోతు జగన్ పైన గుర్రంపోడు పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 84/2019, ఎస్సీ నంబర్. 88/2020, యు/ఎస్ 417, 420, 376(ఎన్) ఐపీసీ సెక్షన్ 3 (2) (వి) ఆఫ్ ఎస్సీ/ఎస్టీ(పి ఓఏ) యాక్ట్-1989 ఆఫ్ పీఎస్ గుర్రంపోడు నందు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహించినట్లు చెప్పారు.
సరైన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించగా నిందితునికి గురువారం జిల్లా అదనప సెషన్ ఎస్సీ, ఎస్టీ కోర్ట్ దోషిగా నిర్ధారించిందని చెప్పారు. సెక్షన్ 376(2)(ఎన్) ఐపీసీ కింద నిందితుడికి పది (10) సంవత్సరాల జైలు మరియు రూ.1000/ జరిమానా, ఎస్సీ/ఎస్టి (పి ఓఏ) చట్టంలోని సెక్షన్ 3(2)(వి) కింద నేరానికి నిందితుడికి పది (10) సంవత్సరాల జైలు మరియు రూ 1000/ జరిమానా, ఐపీసీ సెక్షన్ 420 కింద నేరానికి నిందితుడికి ఏడు (7) సంవత్సరాల జైలు మరియు రూ.1000/ జరిమానాతోపాటు నిందితునికి మొత్తం 27 సంవత్సరాల జైలు శిక్ష విధించబడిందనీ జిల్లా ఎస్పీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com