దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు సయ్యద్ మక్బూల్ మృతి

దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు సయ్యద్ మక్బూల్ మృతి
X

చర్లపల్లి జైల్లో ఉన్న దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు సయ్యద్ మక్బూల్ (52) అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఇండియన్ ముజాయుద్దీన్ ఉగ్రవాదుల సంస్థకు చెందిన సయ్యద్ మక్బూల్ ఇటీవల చర్లపల్లి జైల్లో అనారోగ్యానికి గురికావడంతో జైలు సిబ్బంది గాంధీ ఆసుపత్రికి తరలించారు. నెల రోజుల కిందట సయ్యద్ కు గుండె ఆపరేషన్ జరిగింది. తర్వాత మూత్రపిండాలు విఫలమై ఆరోగ్యం క్షీణించిందని జైలు అధికారులు వివరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సయ్యద్ మక్బూల్ ను గాంధీ ఆసుపత్రిలో చేర్చించగా చికిత్సపొందుతూ గురువారం తెల్లవారు జామున మృతి చెందినట్లు జైలు అధికారులు వెల్లడించారు. సయ్యద్ మక్బూల్ దేశవ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో నిందితుడిగా ఉన్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. దేశవ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో ఆయన హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఆయనకు ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించింది.

సయ్యద్ పై ఆరు నెలల క్రితం హైదరాబాద్లో కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా పలు బాంబు పేలుళ్ల కేసులలో నిందితునిగా ఉన్న సయ్యద్ కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. గత సంవత్సర కాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్న సయ్యద్ ను పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ పై ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తరలించారు. చర్లపల్లి జైల్లో తీవ్ర అస్వస్థతకు గురైన సయ్యద్ మక్బూల్ ను వైద్య సేవల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Tags

Next Story