Drugs Case : డ్రగ్స్ కేసు... డైరెక్టర్ క్రిష్ కీలక వ్యాఖ్యలు

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న దర్శకుడు క్రిష్ (Director Krish) కీలక వ్యాఖ్యలు చేశాడు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్న క్రిష్.. డ్రగ్స్ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వివేకానంద్ ఇచ్చిన స్టేట్‌మెంట్ వల్ల తనని పోలీసులు నిందితుడిగా చేర్చారని, తాను డ్రగ్స్ తీసుకున్నాను అనడానికి ఆధారాలు లేవన్నాడు.
కాగా రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని గచ్చిబౌలి పోలీసులకు హైకోర్టు సూచించింది. పిటిషన్‌పై విచారణను మార్చి 4 సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఫిబ్రవరి 24న గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారు.ఈ కేసులో డైరెక్టర్ క్రిష్ ఏ10గా ఉన్నారు.
క్రిష్‌ని నిందితుడిగా చేర్చిన పోలీసులు విచారణకు హాజరు కావాలని కోరారు. దీనికి తొలుత ఒప‍్పుకొన్న క్రిష్ ఆ తర్వాత రెండు రోజులు గడువు కావాలని శుక్రవారం వస్తానని పోలీసులతో చెప్పాడు. ఇప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడు. తాజాగా ఈ బెయిల్ పై హైకోర్టులో విచారణ జరగ్గా.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com