Family Tragedy : లంచ్ లేట్ అయిందని భార్యపై దాడి, ఆపై ఆత్మహత్య

తనకు మధ్యాహ్న భోజనం అందించడంలో జాప్యం చేసిందనే కారణంతో ఓ 30 ఏళ్ల వ్యక్తి తన భార్యను పదునైన ఆయుధంతో హత్య చేసి, ఆపై తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) సీతాపూర్ జిల్లాలో పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన సోమవారం (మార్చి 18) తాంగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్వలన్‌పూర్వా గ్రామంలో చోటుచేసుకుంది.
మృతులను ప్రేమాదేవి (28), ఆమె భర్త పరస్రామ్‌గా గుర్తించినట్లు థాంగావ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ హనుమంత్ లాల్ తివారీ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం కోపోద్రిక్తుడైన భర్త పరశరామ్ మొదట పదునైన ఆయుధంతో భార్యపై దాడి చేసి హత్య చేశాడు. తదనంతరం, పరిణామాలు, జైలు శిక్షకు భయపడి, అతను ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని SHO తివారీ తెలిపారు.
పరశరామ్ సోమవారం మధ్యాహ్నం పొలాల్లో పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చి భార్యను భోజనం అడిగాడు. అయితే, మధ్యాహ్న భోజనం సిద్ధంగా లేదని గుర్తించిన అతడు మనస్తాపం చెంది వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ తర్వాత భార్యపై పదునైన ఆయుధంతో పదేపదే దాడి చేయడంతో భార్య మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు భర్త గదిలో బంధించి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com