Festival Expenses : భార్యపై భర్త బండ రాయితో దాడి..

Festival Expenses : భార్యపై భర్త బండ రాయితో దాడి..
X

పండుగ సరుకులు కొనివ్వడానికి రాలేదని నిలదీసిన భార్య పై భర్త బండరాయితో దాడి చేసిన ఘటన నిమ్మనపల్లి మండలంలో జరిగింది. పోలీసుల కథనం.. మండలంలోని గారబురుజుకు చెందిన శివకుమార్ మదనపల్లెలో మగ్గాలు నేస్తాడు. శుక్రవారం రాత్రి గారబురుజును శివకుమార్‌ వచ్చాడు. ఉగాది పండుగకు ఇంట్లోకి సరుకులు కొనివ్వడానికి ఎందుకు రాలేదని భార్య దీపిక నిలదిసింది. దీంతో ఆగ్రహించిన భర్త.. భార్యపై బండరాయితో దాడిచేసి గాయపరిచాడు.

మరోవైపు భూమి కబ్జా చేయడమే కాకుండా, అడ్డుకున్న తల్లి,కూతురిపై ఇనుప రాడ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మదనపల్లెలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కోళ్లబైలు గ్రామం బయారెడ్డి కాలనీలోని వెంకటరమణాచారి తన అనుచరులతో స్థానికంగా ఉండే తల్లీకూతుళ్లు సరోజమ్మ, అనురాధల భూమిని కబ్జా అడ్డుకోవడంతో వెంకటరమణాచారి, యశ్వంత్ మరి కొంతమంది దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.

Tags

Next Story