TS : మద్యం మత్తులో లారీ డ్రైవర్ వీరంగం

TS : మద్యం మత్తులో లారీ డ్రైవర్ వీరంగం
X

మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్.. తన లారీ తో బీభత్సం చేశాడు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో రాజీవ్ రహదారి పై ఓ లారీ డ్రైవర్ లారీ తో మద్యం మత్తులో పూసల రోడ్డు నుంచి బస్టాండ్ వరకు బైక్లను ఢీకొంటూ వెళ్లాడు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

డివైడర్ మీది నుండి షాపులోకి లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో గాయపడిన పలువురని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బైకులు ఢీకొంటూ బస్టాండ్ దగ్గరలో ఉన్న వేప చెట్టుకు ఢీకొని లారీ ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది.

స్థానికులు మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ను కిందికి దించి.. చితకబాది పోలీసులకు అప్పజెప్పారు.లారీ డ్రైవర్ మద్యం మత్తులోనే బైక్లను ఢీ కొట్టారని స్థానికులు చెప్తున్నారు.

Tags

Next Story