Train Accident : రైలు ఢీకొని వృద్ధుడు మృతి

Train Accident : రైలు ఢీకొని వృద్ధుడు మృతి

పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో ఓ వృద్ధుడు చనిపోయాడు. ఆయన డెడ్ బాడీని ట్రైన్ 5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన మేడ్చల్​జిల్లా ఘట్​కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన ఎర్ర ఫకీర్(70) భార్య ఏడాది కిందట చనిపోయింది. దాంతో ఫకీర్ మతిస్థిమితం కోల్పోయాడు. కొడుకు వద్ద ఇంట్లోనే ఉంటున్నాడు.

బుధవారం ఉదయం ఫకీరు బయటకు వెళ్లాడు. బీబీనగర్ ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా ఆయనను ట్రైన్ ఢీ కొట్టింది. దీంతో డెడ్ బాడీ ట్రైన్ ఇంజిన్ ముందు భాగాన చిక్కుకుంది. ట్రైన్ ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ చేరుకున్నాక రైల్వే పోలీసులు డెడ్ బాడీని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Tags

Next Story