ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా.. ఒకరు మృతి

ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా.. ఒకరు మృతి
X

ఔటర్ రింగ్ రోడ్డుపై జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే. వరుస సంఘటనలు ఓఆర్ఆర్ ను (ORR) ప్రమాదాలకు అడ్డాగా మార్చుతున్నాయి. రీసెంట్ గా వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఉదయం తాజాగా మరో ప్రమాదం జరిగింది.

సంగారెడ్డి పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై కారు యాక్సిడెంట్ అయింది. ఓఆర్ఆర్ పై అదుపు తప్పి ఓ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

సంగారెడ్డి జిల్లా పరిధి..రామేశ్వరం బండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో అదుపుతప్పి బ్రెజా కారు బోల్తా కొట్టింది. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మేడ్చల్ నుంచి పటాన్ చెరు వస్తుండగా డివైడర్ ఎక్కి అవతలి వైపు కారు పడింది. ఈ ప్రమాద సమయంలో అవతలి వైపు నుంచి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది.

Tags

Next Story