Nellore : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు నుజ్జునుజ్జు

నెల్లూరు జిల్లాలో (Nellore District) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొట్టింది. ముసునూరు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొదట ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది.
అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బస్సు నుజ్జునుజ్జు అయింది.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు బస్సు ప్రమాదంపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ప్రమాద పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
గాయపడిన వారి వివరాలు..
చంద్ర శేఖర్(37)..
సురేష్..(32)
గోపి నాథ్ (23)
మనోజ్ (23)
రాజ్ కుమార్ (38)
ఎస్.రమణ (38)
పవన్ (23)
ధనవేశ్వర్ (28)
రణధీర్ (31)
త్రికరణ్ (46)
శ్వేతా (19)
అజిత (30)
కన్నన్ (50)
రూప( 30)
మైథిలి (35)
అక్షయ్ (34)
గణేష్(51)
నితీష్ (20)..
లోకేష్ (35)
లక్ష్మీ (34)
కమలమ్మ (63)
నిర్మల(49)
కేశవ్(39).
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com