Food Poisoning : గురుకుల బడిలో ఫుడ్‌ పాయిజన్‌తో 100 మందికి అస్వస్థత

Food Poisoning : గురుకుల బడిలో ఫుడ్‌ పాయిజన్‌తో 100 మందికి అస్వస్థత
X

తిరుపతిలోని నాయుడుపేట అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో 100 మంది విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్‌ ​​కావడంతో ఆస్పత్రి పాలయ్యారు. మెస్‌లో భోజనం చేసిన విద్యార్థినులు విరేచనాలు, వాంతులు, కళ్లు తిరగడంతో బాధపడ్డారు. 50 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురికాగా, మిగిలిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. పాఠశాల మెస్‌లో రెండు రోజుల నాటి భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. దీంతో విద్యార్థులందరికీ కడుపు నొప్పి వచ్చింది.

ఈ ఘటనపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను ఆయన పరామర్శించే అవకాశం ఉంది.

Tags

Next Story