Four Major Train Accidents : ఏడాదిలోనే నాలుగు ఘోర రైలు ప్రమాదాలు

Four Major Train Accidents : ఏడాదిలోనే నాలుగు ఘోర రైలు ప్రమాదాలు
X

వరుస ప్రమాదాలు భారతీయ రైల్వేకు మాయని మచ్చగా మారుతున్నాయి. 2023 జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌ రైలు దుర్ఘటనలో 293మంది మరణించారు. అదే ఏడాది OCTలో విజయనగరంలో 2 రైళ్లు ఢీకొనడంతో 14 మంది చనిపోయారు. ఈనెల 2న పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహెబ్‌ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. తాజాగా ఇవాళ బెంగాల్‌ న్యూజల్పాయిగుడిలో ప్యాసింజర్, గూడ్స్ ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. దీంతో ఇండియన్ రైల్వేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ( Railway Minister Ashwini Vaishnav ) స్పందించారు. ‘NFR జోన్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే, NDRF, SDRF సమన్వయంతో పనిచేస్తున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు’ అని Xలో పోస్ట్ చేశారు. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

అటు బాధితులకు ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వనున్నారు. ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఈ ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోగా 60మంది గాయపడ్డారు. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Tags

Next Story