Medchal District : గంజాయి అమ్ముతుండ్రని చెప్పినందుకు దోస్తునే చంపారు

Medchal District : గంజాయి అమ్ముతుండ్రని చెప్పినందుకు దోస్తునే చంపారు
X

దోస్తులు గంజాయి అమ్ముతున్నారని ప్రచారం చేశారని యువకుడిని తన స్నేహితు లే దాడి చేసి చంపేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్వాల్కు చెందిన ప్రణీత్ (21) హోమ్ శ్రీ బిల్డర్స్ లో ప్రైవేటు జాబ్చేస్తున్నాడు. తన దోస్తులు గంజాయి విక్రయిస్తున్నారని ప్రణీత్ కాలనీలో ప్రచారం చేశారని తన స్నేహితులు అతడిపై కక్ష పెంచుకున్నారు. ఈ నెల 5న ప్రణీస్ఇంటికి వెళ్లిన ఐదుగురు ప్రెండ్స్ అతడిని బైక్ పై ఎక్కించుకొని జహహర్ నగర్ పరిధి యాప్రాలు తీసుకెళ్లారు. గోవర్ధన్, విన్సెంట్, యశ్వంత్ అనే యువకుడు ప్రణీతన్ను ఇష్టంవచ్చిన్నట్లు కొట్టారు. గంట పాటు పైశాచికంగా హింసించి హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించారు. దాడి చేసిన తర్వాత ప్రణీత్ తమ్ముడి కాల్ చేసి యాక్సిడెంట్ జరిగిన్నట్లు చెప్పారు. ఈ విషయం బయటకు రాకుండా మృతుడి మొబైల్కూడా లాక్కున్నారు. తీవ్ర గాయాలు కావడంతో ప్రణీత్ వేసుకున్న షర్ట్ తీసేసి డెలివరి బాయ్ టీషర్ట్ వేసిన్నట్లు తెలుస్తోంది. మృతుడు ఇవాళ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story