TS : ప్రేమ పేరుతో తోటి ఉద్యోగికి వేధింపులు

TS : ప్రేమ పేరుతో తోటి ఉద్యోగికి వేధింపులు

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో ప్రేమ పేరుతో వేదిస్తున్న తోటి ఉద్యోగి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వేధింపులు భరించలేక బాధితురాలు శామీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కలెక్టరేట్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అజయ్.. కొంతకాలంగా ప్రేమించాలని వేధిస్తున్నాడని మహిళా జూనియర్ అసిస్టెంట్ ఆరోపించింది. పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో పరిధిలో హాట్ టాపిక్ గా మారింది.

Tags

Next Story