Telangana : మాంసం వండలేదని.. భార్యను కొట్టిచంపిన భర్త

Telangana : మాంసం వండలేదని.. భార్యను కొట్టిచంపిన భర్త
X

రాత్రిపూట ఇంటికి వచ్చిన భర్త తన భార్యతో మాంసం కూర వండలేదని గొడపడ్డాడు. చివరకు ఆమెను చంపేస్థాయికి వెళ్లిపోయాడు. కూర వండలేదని ఆగ్రహించిన భర్త విచక్షణ కోల్పోయి భార్యను కొట్టి చంపాడు. ఈ సంఘటన సిరోల్ మండలంలోని ఉప్పరగూడెం శివారు బూరుగు చెట్టు తండా గ్రామపంచాయతీ పరిధిలోని మాంజా తండాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాంజ తండాకు చెందిన మాలోత్ బాలు, మాలోత్ కళావతి (38) ని మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో గొడవపడి కొట్టి చంపాడు. బుధవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న మరిపెడ సీఐ రాజ్కుమార్, సీరోల్ ఎస్ఐ నగేష్ మహిళ మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఇస్లావత్ లక్ష్మి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Tags

Next Story