Murder : మరొకరితో భార్య అక్రమ సంబంధం.. భర్త ఏం చేశాడంటే..?

వివాహేతర సంబంధాలతో సంసారాలు ఛిద్రమవుతున్నాయి. సంతోషంగా ఉండాల్సిన కుటుంబాల్లో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. అక్రమ బంధాల మాయలో పడి క్షణకాలం కూడా ఆలోచించకుండా కట్టుకున్న వాళ్ళను కడతెరుస్తున్నారు. అలాంటి విషాద ఘటనే ఏపీ లో జరిగింది. తన భార్య మరొకరితో సంబంధం పెట్టుకుంది అని తెలిసి ఆ భర్త తట్టుకోలేకపోయాడు. వద్దని వారించిన భార్య వినక పోవడంతో కోపంతో భార్య ను హతమార్చాడు భర్త.
పోలీసుల వివరాల ప్రకారం... కడప జిల్లా చాపాడు మండలం పెద్ద చీపాడు గ్రామానికి చెందిన గోపాల్ , సుజాత లు భార్యభర్తలు .కూలి పనిచేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్న వీరి సంసారంలో అక్రమ సంబంధం చిచ్చు రాజేసింది. భార్య సుజాత కు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడి అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నిత్యం అతడితోనే ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. విషయం తెలుసుకున్న గోపాల్ భార్య ను హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు మందలించాడు.
అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన గోపాల్ ఎలాగైన భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం గుట్టుచప్పుడు కాకుండా సుజాత ప్రాణాలు తీసి డెడ్ బాడీని సంచిలో పెట్టి అటవీ ప్రాంతంలో పడేసాడు గోపాల్. పోలీసులకు విషయం తెలిస్తే తనకు ఎలాగైనా శిక్ష తప్పదు అని భయపడ్డ గోపాల్ తానే నేరుగా స్టేషన్ కి వెళ్ళి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సుజాత డెడీబాడీ కోసం అడవిలో తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com