భార్యను హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించబోయిన భర్త

భార్యను హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించబోయిన భర్త

ఓ భర్త తన భార్యను హతమార్చి ప్రమాదం జరిగినట్లుగా చూపించేందుకు ప్రయత్నించి విఫలమైన ఘటన గోవాలో సంచలనం సృష్టించింది. హత్య కేసులో నిందితుడైన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం ప్రకారం, నిందితుడి పేరు గౌరవ్ కతియార్, అతని వయస్సు 29 సంవత్సరాలు. గౌరవ్ సౌత్ గోవాలోని ఓ లగ్జరీ హోటల్‌లో మేనేజర్.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గౌరవ్(gourav)తన 27 ఏళ్ల భార్య దీక్షా గంగ్వార్‌ను(deeksha gangwar) గోవాలోని కాబో డి రామా బీచ్‌లో(rama beach) నీటిలో ముంచి హత్య చేసి, ఆ మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. తాను ఐస్‌క్రీం కొనుక్కుని వెళ్తుండగా తన భార్య దీక్ష సముద్రంలో మునిగి పోయిందని, దీంతో ఆమె చనిపోయిందని గౌరవ్ పోలీసులకు తెలిపాడు.

అయితే ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీశాడు. ఆ తర్వాత గౌరవ్ రహస్యం బట్టబయలైంది. అక్కడ ఉన్న ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, శుక్రవారం మధ్యాహ్నం బీచ్ సమీపంలో మరణించిన దీక్షా మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. జనవరి 20న శనివారం గౌరవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.దీక్ష ఉత్తరప్రదేశ్‌లోని(uttar pradesh) లక్నో(lucknow) నివాసి, ఆమెకు గౌరవ్ కతియార్ అనే వ్యక్తితో ఏడాది క్రితమే వివాహమైంది. గౌరవ్ కూడా లక్నో నివాసి. అతను దక్షిణ గోవాలోని కోల్వా ప్రాంతంలో రెస్టారెంట్ నడుపుతున్నాడు.

జనవరి 19న సాయంత్రం గౌరవ్ తన భార్య దీక్షతో కలిసి కాబో-డి-రామా ప్రాంతంలోని రాజ్‌బాగ్ బీచ్‌కు వెళ్లాడు. ఈ సమయంలో ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది . ఆ తర్వాత గౌరవ్ దీక్షను నీటిలో ముంచడంతో ఆమె మరణించింది. హత్యను యాక్సిడెంట్‌గా మార్చేందుకు గౌరవ్‌ ఐస్‌క్రీమ్‌ కొనుక్కోవడానికి వెళ్లాననీ, ఆ సమయంలో నీళ్లలో మునిగి భార్య చనిపోయిందని అరవడం ప్రారంభించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గౌరవ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఇంతలో, గౌరవ్ నీటిలో నుండి బయటకు వస్తున్నట్లు ఒక వ్యక్తి తీసిన వీడియో దొరికింది.

ఈ విషయంపై పోలీసులు గౌరవ్‌ను కఠినంగా విచారించారు, పదేపదే వేర్వేరు వాంగ్మూలాలు ఇవ్వడంతో, గౌరవ్ చివరకు తన నేరాన్ని అంగీకరించాడు. తన భార్యను హత్య చేసింది తానేనని అంగీకరించాడు. నిందితుడు గౌరవ్‌పై పోలీసులు సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేశారు

Tags

Read MoreRead Less
Next Story