TG : అక్రమ గంజాయి దహనం

TG : అక్రమ గంజాయి దహనం
X

తెలంగాణ వ్యాప్తంగా పలు రైళ్ల లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పలు రైల్వేస్టేషన్ లలో పోలీసులు పట్టుకున్నారు. అలా పట్టుబడిన 1,575 కిలోల గంజాయిని బుధవారం దహనం చేశారు.

డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ చందనా దీప్తి , అర్బన్ రైల్వే జోన్ డీఎస్పీ ఎస్ఎన్ జావిద్ ఆధ్వర్యంలో గంజయిని దహనం చేశారు. భువనగిరి (మం) తుక్కాపూర్ రోమా ఇండస్ట్రీస్ మెడికల్ వేస్టేజ్ కంపెనీలో పట్టుబడిన 1575 కిలోల గంజాయిని దహనం చేశారు.

2021నుండి 2023 సంవత్సరం మధ్యలో 52 కేసుల్లో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కాజీపేట, నల్గొండ, వికారాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయిని పట్టుకున్నట్లు వెల్లడించారు డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ చందన దీప్తి.

Tags

Next Story