ఇంట్లో మందలించారని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ఇంట్లో మందలించారని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
X

ఇంటర్ విద్యార్థి (Inter student) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సైబరాబాద్ (Cyberabad) కమిషనరేట్ లోని రాయదుర్గం పోలీసు స్టేషన్ (Raidurgam Police Station) పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు మండలం రాజిపేటకు చెందిన బానోతు కుమారి, భజ్జు దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చారు. ఈక్రమంలో బానోతు కుమారి, భజ్జు దంపతులు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పీజేఆర్ కాలనీలో నివాసం ఉంటూ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఈ దంపతుల చిన్నకుమారుడు బానోతు జశ్వంత్ (17) రాయదుర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో మంగ ళవారం కాలేజీ నుండి ఆలస్యంగా వచ్చాడని ఇంట్లో వాళ్లు మందలించారు. దీం తో బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై మృతుని తల్లి కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Tags

Next Story