IPS ఆఫీసర్ సీవీ ఆనంద్ ఫేక్ ప్రొఫైల్ నిందితుడు అరెస్ట్
By - Manikanta |28 Feb 2024 6:35 AM GMT
సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదు. వీరి ఐపీ అడ్రస్ తో కూపీలాగి సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కూడా పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ పేరుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తెరిచి సైబర్ నేరానికి పాల్పడిన నిందితుడిని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు.
ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లతో రాజస్థాన్ ప్రాంతానికి చెందన నిందితుడు జఫార్ ఖాన్ ఫేస్‌బుక్ ఖాతాలను సృష్టించాడు. అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్యేల పేరుతో నకిలీ ఖాతాలను తెరిచి తనకు డబ్బు పంపాలని పలువురికి మెజేస్‌లు కూడా పంపాడు.
రాష్ట్రంలో ప్రముఖుల ఫొటోలను ప్రొఫైల్ పిక్‌గా పెట్టి సామాన్యులను మోసం చేస్తున్న జఫార్ఖాన్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడు జఫార్ ఖాన్‌ను రిమాండ్‌కు పంపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com