Jagajyoti Arrest : లంచం తీసుకుంటూ దొరికిన జగజ్యోతి అరెస్ట్..

Jagajyoti Arrest : లంచం తీసుకుంటూ దొరికిన జగజ్యోతి అరెస్ట్..

రూ.84 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి (ACB) రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన జగజ్యోతిని అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ఆమె ఇంట్లో సోదాలు చేసిన అధికారులు రూ.65 లక్షల నగదుతో పాటు 4 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జగజ్యోతిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు ఏసీబీ అధికారులు.

ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పనిచేస్తున్న జగజ్యోతి.. నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లు మొత్తాలు చెల్లించేందుకు రూ.84 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. దీంతో ఒక్క సారిగా షాక్ కు గురైన ఆమె వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిజామబాద్ కు చెందిన కాంట్రాక్టర్ బోడుకం గంగన్న గాజుల రామారంలో జూవెనల్ హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన బిల్లు మొత్తాల విషయంలో జగజ్యోతిని సంప్రదించాడు. నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లు మొత్తాలు చెల్లించేందుకు రూ. 1.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. నిర్మాణంలో లాభాలు రాలేదని, అంత మొత్తాలు ఇవ్వలేనని బేరమాడటంతో రూ.లక్ష ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తానని ఏఈ తేల్చిచెప్పింది.

ఈక్రమంలో తొలివిడతగా రూ.84 వేలు ఇచ్చేలా ఇద్దరి మధ్య ఒప్పదం కుదిరింది. ట్రైబల్ వెల్పేర్ కార్యాలయంలో ఇచ్చే ముందు, కాంట్రాక్టర్ గంగన్న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం బాధితుడి నుండి జగజ్యోతి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు

Tags

Read MoreRead Less
Next Story