Lawrence Bishnoi : లారెన్స్ బిష్ణోయ్ టార్గెట్ సల్మాన్.. సెక్యూరిటీ టైట్

Lawrence Bishnoi : లారెన్స్ బిష్ణోయ్ టార్గెట్ సల్మాన్.. సెక్యూరిటీ టైట్
X

ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో మరోసారి బిష్ణోయి కమ్యూనిటీ తెరపైకి వచ్చింది. సల్మాన్ ఖాన్కి ఆప్తమిత్రుడిగా ఉన్న సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ కాల్చిచంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ సల్మాన్ ఖాన్కి ఎందుకు టార్గెట్ చేస్తున్నది? దీనికి అసలు కారణం.. 1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ కోసం జోధ్పూర్ వెళ్లిన సమయంలో.. సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకల్ని వేటాడి చంపేశాడు.

అప్పటి నుంచి బిష్ణోయ్ తెగకు సల్మాన్ ఖాన్కి మధ్య యుద్ధమే నడుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో 5 ఏళ్ల వయసున్న లారెన్స్ బిష్ణోయ్.. ఇప్పుడు ఏకంగా గ్యాంగ్ స్టర్ గా మారి సల్మాన్ ఖాన్ని చంపేస్తానని హెచ్చరిస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది.

సిద్ధిఖీ హత్యతో సల్మాన్ ఖాను బెదిరింపులు పెరగడం, కృష్ణజింకలను చంపడం చుట్టూ ఉన్న దీర్ఘకాల వివాదాన్ని మరోసారి తెరపైకి వచ్చింది. కృష్ణజింకలను అత్యంత గౌరవంగా చూసుకునే బిష్ణోయి వర్గం వారు సల్మాన్ ఖాన్ చేసిన పనికి తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సిద్ధిఖీ హత్య నేపథ్యంలో సల్మాన్ ఖాను గట్టి భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు.

Tags

Next Story