Maharashtra Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

Maharashtra Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
Maharashtra Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్థా జిల్లాలో వంతెన పైనుంచి కారు కిందన ఘటనలో ఏడుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు.

Maharashtra Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్థా జిల్లాలో వంతెన పైనుంచి కారు కిందన ఘటనలో ఏడుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతుల్లో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది.

సావంగిలోని మెడికల్‌ కాలేజీలో MBBS చదువుతున్న ఏడుగురు విద్యార్థులు నిన్న రాత్రి పదకొండున్నరకు దేవ్లీ నుంచి వార్ధా వెళ్తుండగా.. సెల్సురా వంతెనపై ఓ జంతువు అడ్డం వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో విద్యార్ధులు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి వంతెనపై నుంచి కాలువలో పడిపోయింది.

అతివేగంగా వస్తుండటంతో కారు కిందపడి నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో కారులోని వారంతా అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో గోండ్యా జిల్లా తిరోడా ఎమ్మెల్యే విజయ్ రహంగ్డాలే కుమారుడు ఆవిష్కర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే విద్యార్ధులనుకాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story