Suicide : పోలీసులు వేధిస్తున్నారని ఒకరి ఆత్మహత్య
భూపాలపల్లి ఎస్సై, కానిస్టేబుల్ వేధిస్తున్నారంటూ సూసైడ్ నోట్ రాసిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం..భూపాలపల్లికి చెందిన గుత్తికొండ సంపత్ రిటైర్డ్ ఎంప్లాయ్. ఇతడి పెద్ద కొడుకు రాము (35) తన భార్య గౌతమితో కలిసి కొన్ని నెలలు హైదరాబాద్‌లో వ్యాపారం చేశాడు. నష్టాలు రావడంతో రెండు నెలల కింద ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి రాము, గౌతమి మధ్య గొడవలు జరగడంతో ఆమె అతడిపై గృహహింస చట్టం కింద భూపాలపల్లి పీఎస్‌లో కంప్లయింట్ చేసింది. దీంతో మే18న ఎస్ఐ, కానిస్టేబుల్ పిలిపించి మందలించారు. జూన్ 24న పీఎస్‌కు రావాలని ఫోన్ చేయడంతో భయపడి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా టేకుమట్ల మండలంలోని కలికోటపల్లెలో ఉన్న మామ(తండ్రి బావమరిది) శ్రీనివాస్ ఇంటికి వెళ్లాడు. అక్కడే ఉన్న రాము..మళ్లీ పోలీసులు ఫోన్ చేసి పిలుస్తారనే భయంతో ‘పోలీసుల వేధింపుల భయంతోనే నేను చనిపోతున్నా’ అని సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి సంపత్ ఫిర్యాదు చేయగా టేకుమట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టేకుమట్ల ఎస్ఐ మాట్లాడుతూ మృతుడి జేబులో సూసైడ్ నోటు దొరికిందని, అందులో ఉన్న వివరాలను పూర్తిస్థాయి విచారణ అనంతరం బయట పెడతామన్నారు. ఈ విషయమై భూపాలపల్లి సీఐ నరేశ్వివరణ కోరేందుకు ఫోన్‌చేయగా ఆయన స్పందించలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com