Suicide : అప్పు చెల్లించలేక సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య

Suicide : అప్పు చెల్లించలేక సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య
X

తీసుకున్న అప్పు చెల్లించలేక ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జీనోంవ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.శామీర్ పేట మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన రుద్రబోయిన మహేందర్(35) అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 2023లో రూ.6లక్షల అప్పు తీసుకున్నారు. అందులో ఆ వ్యక్తికి రూ,4లక్షల 70వేలు తిరిగి చెల్లించారు. మిగిలిన డబ్బులు చెల్లించాలని అప్పిచ్చిన వ్యక్తి ఒత్తిడి చేయటంతో బాధితుడు తీవ్ర మనస్తాపానికి గురై తన బాధను ఫోన్ లో సెల్ఫీ వీడియో తీసి పాత ఇనుప సామాను దుకాణంలో దూలానికి నైలాన్ తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు సెల్ఫీ వీడియో బయట పడగా అసలు విషయం బయటపడింది. ఆత్మహత్యకు ముందు మృతుడు సుసైడ్ లేఖ రాయగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురికి తరలించి కేసు ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story