Chittoor: నరకాల్సింది పొట్టేలు తల.. కానీ మనిషిని..

X
Chittoor: కనుమ పండుగ రోజు ఘోరం జరిగింది. పొట్టేలును బలివ్వబోయి వ్యక్తి తల నరికివేశాడో యువకుడు. దీంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాధితుడు కన్నుమూశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. మదనపల్లె మండలం వలసపల్లెలో ప్రజలు కనుమ పండుగను ఘనంగా నిర్వహించాలని తలపెట్టారు.
ఈ క్రమంలో ఊరి పొలిమేరన ఉన్న గ్రామ దేవతకు జంతు బలి ఇచ్చే సమయంలో పొట్టేలును తీసుకొని వచ్చాడు సురేష్ అనే వ్యక్తి. మద్యం మత్తులో ఉన్న చలపతి అనే యువకుడు పొట్టేలు తల నరికే ప్రయత్నంలో సురేష్ తల నరికేశాడు. కుప్పకూలిన బాధితుడిని స్థానికులు హుటాహుటిన మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
